శ్రీవిద్యుత్కలితాఽజవంజవమహా జీమూతపాపాంబుధా శ్రీ కాళ హస్తీశ్వర శతకం లిరిక్స్ ఇన్ తెలుగు, PDF, MP3, డౌన్లోడ్ 🌷

Facebook_share_www.chalisa.onlineTwitter_share_www.chalisa.onlineInstagram_www.chalisa.onlinePosted on March 16, 2021 at 09:17 PM

Sree Kaala Hastiswara Satakam Telugu-Srividyutkalitajavanjavamaha Jimutapapambudha-telugu-Lyrics-Pdf

🏵 Mahadev Stotra Lyrics In Telugu


|| శ్రీ కాళ హస్తీశ్వర శతకం ||
శ్రీవిద్యుత్కలితాఽజవంజవమహా-జీమూతపాపాంబుధా-
రావేగంబున మన్మనోబ్జసముదీ-ర్ణత్వంబు~ం గోల్పోయితిన్ ।
దేవా! మీ కరుణాశరత్సమయమిం-తే~ం జాలు~ం జిద్భావనా-
సేవం దామరతంపరై మనియెదన్- శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 1 ॥
వాణీవల్లభదుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి ని
ర్వాణశ్రీ~ం జెఱపట్ట~ం జూచిన విచారద్రోహమో నిత్య క
ళ్యాణక్రీడల~ం బాసి దుర్దశలపా లై రాజలోకాధమ
శ్రేణీద్వారము దూఱ~ంజేసి తిపుడో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 2 ॥
అంతా మిధ్య తలంచి చూచిన నరుం డట్లౌ టెఱింగిన్ సదా
కాంత ల్పుత్రులు నర్ధమున్ తనువు ని క్కంబంచు మోహార్ణవ
చిభ్రాంతిం జెంది జరించు గాని పరమార్ధంబైన నీయందు~ం దా~ం
జింతాకంతయు జింత నిల్ప~ండుగదా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 3 ॥
నీ నా సందొడ~ంబాటుమాట వినుమా నీచేత జీతంబు నే~ం
గానిం బట్టక సంతతంబు మది వేడ్కం గొల్తు నంతస్సప
త్నానీకంబున కొప్పగింపకుము నన్నాపాటీయే చాలు~ం దే
జీనొల్లం గరి నొల్ల నొల్ల సిరులన్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 4 ॥
భవకేలీమదిరామదంబున మహా పాపాత్ము~ండై వీడు న
న్ను వివేకింప~ం డటంచు నేను నరకార్ణోరాశిపాలైన~ం బ
ట్టవు; బాలుండొకచోట నాటతమితోడ న్నూత~ం గూలంగ~ం దం
డ్రి విచారింపక యుండునా కటకటా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 5 ॥
స్వామిద్రోహము~ం జేసి యేనొకని గొల్వంబోతినో కాక నే
నీమాట న్విననొల్లకుండితినొ నిన్నే దిక్కుగా~ం జూడనో
యేమీ ఇట్టివృధాపరాధినగు నన్నీ దుఃఖవారాశివీ
చీ మధ్యంబున ముంచి యుంపదగునా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 6 ॥
దివిజక్ష్మా రుహ ధేను రత్న ఘనభూతి ప్రస్ఫురద్రత్నసా
నువు నీ విల్లు నిధీశ్వరుండు సఖు~ం డర్ణోరాశికన్యావిభుం
డువిశేషార్చకు~ం డింక నీకెన ఘనుండుం గల్గునే నీవు చూ
చి విచారింపవు లేమి నెవ్వ~ండుడుపున్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 7 ॥
నీతో యుధ్ధము చేయ నో~ంప~ం గవితా నిర్మాణశక్తి న్నినుం
బ్రీతుంజేయగలేను నీకొఱకు దండ్రింజంపగా~ంజాల నా
చేతన్ రోకట నిన్నుమొత్తవెఱతుంజీకాకు నాభక్తి యే
రీతిన్నాకి~ంక నిన్ను జూడగలుగన్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 8 ॥
ఆలుంబిడ్డలు దల్లిదండ్రులు ధనంబంచు న్మహాబంధనం
బేలా నామెడ గట్టినాడవిక నిన్నేవేళ~ం జింతింతు ని
ర్మూలంబైన మనంబులో నెగడు దుర్మోహాబ్ధిలో~ం గ్రుంకి యీ
శీలామాలపు జింత నెట్లుడిపెదో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 9 ॥
నిప్పై పాతకతూలశైల మడచున్ నీనామమున్ మానవుల్
తప్పన్ దవ్వుల విన్న నంతక భుజాదర్పోద్ధతక్లేశముల్
తప్పుందారును ముక్తు లౌదు రవి శాస్త్రంబుల్మహాపండితుల్
చెప్పంగా దమకింక శంక వలెనా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 10 ॥
వీడెంబబ్బిన యప్పుడుం దమ నుతుల్ విన్నప్పుడుంబొట్టలో~ం
గూడున్నప్పుడు శ్రీవిలాసములు పైకొన్నప్పుడుం గాయకుల్
పాడంగ వినునప్పుడున్ జెల~ంగు దంభప్రాయవిశ్రాణన
క్రీడాసక్తుల నేమి చెప్పవలెనో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 11 ॥
నిను సేవింపగ నాపదల్ వొడమనీ నిత్యోత్సవం బబ్బనీ
జనమాత్రుండననీ మహాత్ము డననీ సంసారమోహంబు పై
కొననీ జ్ఞానము గల్గనీ గ్రహగనుల్ గుందింపనీ మేలువ
చ్చిన రానీ యవి నాకు భూషణములో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 12 ॥
ఏ వేదంబు బఠించె లూత భుజంగం బేశాస్త్రముల్సూచె దా
నే విద్యాభ్యసనంబొనర్చె~ం గరి చెంచేమంత్ర మూహించె బో
ధావిర్భావనిదానముల్ చదువులయ్యా! కావు! మీపాదసం
సేవాసక్తియె కాక జంతుతతికిన్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 13 ॥
కాయల్ గాచె వధూనఖాగ్రములచే గాయంబు వక్షోజముల్
రాయన్ రాపడె ఱొమ్ము మన్మధ విహారక్లేశవిభ్రాంతిచే
బ్రాయం బాయెను బట్టగట్టె దలచెప్పన్ రోత సంసారమే~ం
జేయంజాల విరక్తు~ం జేయ~ంగదవే శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 14 ॥
నిన్నేరూపముగా భజింతు మదిలో నీరూపు మోకాలొ స్త్రీ
చన్నో కుంచము మేకపెంటికయొ యీ సందేహముల్మాన్పి నా
కన్నార న్భవదీయమూర్తి సగుణా కారంబుగా జూపవే
చిన్నీరేజవిహారమత్తమధుపా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 15 ॥
నిను నావా~ంకిలి గావుమంటినొ మరున్నీలాకాభ్రాంతి~ం గుం
టెన పొమ్మంటినొ యెంగిలిచ్చి తిను తింటే~ంగాని కాదంటినో
నిను నెమ్మిందగ విశ్వసించుసుజనానీకంబు రక్షింప~ంజే
సిన నావిన్నపమేల గైకొనవయా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 16 ॥
ఱాలన్ ఱువ్వగ~ం జేతులాడవు కుమారా! రమ్ము రమ్మంచునే~ం
జాలన్ జంపంగ నేత్రము ందివియంగాశక్తుండనే~ం గాను నా
శీలం బేమని చెప్పనున్నది~ంక నీ చిత్తంబు నా భాగ్యమో
శ్రీలక్ష్మీపతిసేవితాంఘ్రియుగళా! శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 17 ॥
రాజుల్ మత్తులు వారిసేవ నరకప్రాయంబు వారిచ్చునం
భోజాక్షీచతురంతయానతురగీ భూషాదు లాత్మవ్యధా
బీజంబుల్ తదపేక్ష చాలు మరితృప్తిం బొందితిన్ జ్ఞానల
క్ష్మీజాగ్రత్పరిణామ మిమ్ము దయతో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 18 ॥
నీరూపంబు దలంప~ంగా~ం దుదమొదల్ నేగాన నీవైనచో
రారా రమ్మని యంచు~ం జెప్పవు పృధారంభంబు లింకేటికిన్!
నీర న్ముంపుము పాల ముంపు మి~ంక నిన్నే నమ్మినా~ండం జుమీ
శ్రీరామార్చిత పాదపద్మయుగళా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 19 ॥
నీకు న్మాంసము వాంఛయేని కఱవా నీచేత లేడుండ~ంగా~ం
జోకైనట్టి కుఠారముండ ననల జ్యోతుండ నీరుండ~ంగా
బాకం బొప్ప ఘటించి చేతిపునుకన్ భక్షింపకాబోయచే~ం
జేకొం టెంగిలిమాంసమిట్లు దగునా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 20 ॥
రాజై దుష్కృతి~ం జెందె~ం జందురుండు రారాజై కుబేరుండు దృ
గ్రాజీవంబున~ం గాంచె దుఃఖము కురుక్ష్మాపాలు~ం డామాటనే
యాజిం గూలె సమస్తబంధువులతో నా రాజశబ్ధంబు చీ
ఛీ జన్మాంతరమందు నొల్లనుజుమీ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 21 ॥
రాజర్ధాతు~ండైనచో నెచట ధర్మంబుండు నేరీతి నా
నాజాతిక్రియ లేర్పడున్ సుఖము మాన్యశ్రేణి కెట్లబ్బు రూ
పాజీవాళికి నేది దిక్కు ధృతినీ భక్తుల్ భవత్పాదనీ
రేజంబుల్ భజియింతు రేతెఱ~ంగునన్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 22 ॥
తర~ంగల్ పిప్పలపత్రముల్ మెఱ~ంగు టద్దంబుల్ మరుద్దీపముల్
కరికర్ణాంతము లెండమావుల తతుల్ ఖద్యోత్కీటప్రభల్
సురవీధీలిఖితాక్షరంబు లసువుల్ జ్యోత్స్నాపఃపిండముల్
సిరులందేల మదాంధులౌదురు జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 23 ॥
నిన్నున్నమ్మిన రీతి నమ్మ నొరులన్ నీకన్న నాకెన్నలే
రన్నళమ్ములు తల్లిదండ్రులు గురుందాపత్సహాయుందు నా
యన్నా! యెన్నడు నన్ను సంస్కృతివిషాదాంభోధి దాటించి య
ఛ్చిన్నానందసుఖాబ్ధి~ం దేల్చెదొ కదే శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 24 ॥
నీ పంచం బడియుండగా~ం గలిగినన్ భిక్షాన్నమే చాలు న్
క్షేపం బబ్బిన రాజకీటముల నేసేవింప్~ంగానోప నా
శాపాశంబుల~ం జుట్టి త్రిప్పకుము సంసారార్ధమై బంటుగా~ం
జేపట్టం దయ గల్గేనేని మదిలో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 25 ॥
నీ పేరున్ భవదంఘ్రితీర్ధము భవన్నిష్ఠ్యూత తాంబూలమున్
నీ పళ్లెంబు ప్రసాదముం గొనికదా నే బిడ్డనైనా~ండ న
న్నీపాటిం గరుణింపు మో~ంప ని~ంక నీనెవ్వారికిం బిడ్డగా~ం
జేపట్టం దగు~ం బట్టి మాన~ం దగదో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 26 ॥
అమ్మా యయ్య యటంచు నెవ్వరిని నేనన్నన్శివా! నిన్నునే
సుమ్మీ! నీ మది~ం దల్లిదండ్రులనటంచు న్జూడ~ంగా~ంబోకు నా
కిమ్మై~ం దల్లియు~ం దండ్రియున్ గురు~ండు నీవే కాక సంసారపుం
జిమ్మంజీకంటి గప్పిన న్గడవు నన్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 27 ॥
కొడుకుల్ పుట్ట రటంచు నేడ్తు రవివేకుల్ జీవనభ్రాంతులై
కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్
వడసెం బుత్రులు లేని యా శుకునకున్ బాటిల్లెనే దుర్గతుల్!
చెడునే మోక్షపదం మపుత్రకునకున్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 28 ॥
గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీకళ్యాణనామంబు ప్ర
త్యహముం బేర్కొనుత్తమోత్తముల బాధంబెట్టగానోపునే?
దహనుం గప్పంగంజాలునే శలభసంతానంబు నీ సేవ~ం జే
సి హతక్లేసులు గారుగాక మనుజుల్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 29 ॥
అడుగంమోనిక నన్యమార్గరతులంబ్రాణావనోత్సాహినై
యడుగంబోయిన మోదు నీదు పదపద్మారాధకశ్రేణియు
న్నెడకు న్నిన్ను భజింపంగా~ంగనియు నాకేలా పరాపేక్ష కో
రెడి దింకేమి భవత్ప్రసాదమె తగున్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 30 ॥
మదమాతంగము లందలంబుల హరుల్ మాణిక్యము ల్పల్లకుల్
ముదితల్ చిత్రదుకూలము ల్పరిమళంబు ల్మోక్షమీ~ంజాలునే?
మదిలో వీని నపేక్షసేసి నృపధామద్వారదేశంబు~ం గా
చి దినంబుల్ వృధపుత్తురజ్ఞులకటా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 31 ॥
రోసీ రోయదు కామినీజనుల తారుణ్యోరుసౌఖ్యంబులన్
పాసీ పాయరు పుత్రమిత్రజన సంపద్భ్రాంతి వాంఛాలతల్
కోసీ కోయదు నామనం బకట నీకుం బ్రీతిగా సత్ క్రియల్
చేసీ చేయదు దీని త్రుళ్ళణపవే శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 32 ॥
ఎన్నేళ్ళుందు నేమి గందు ని~ంకనేనెవ్వారి రక్షించెదన్
నిన్నే నిష్ఠ భజించెద న్నిరుపమోన్నిద్రప్రమోదంబు నా
కెన్నండబ్బెడు నంతకాలమి~ంక నేనిట్లున్న నేమయ్యెడిం?
జిన్నంబుచ్చక నన్ను నేలుకొలవే శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 33 ॥
చావం గాలము చేరువౌ టెఱి~ంగియుం జాలింప~ంగా లేక న
న్నెవైద్యుండు చికిత్స~ం బ్రోవ~ంగల~ండో యేమందు రక్షించునో
ఏ వేల్పుల్ కృప~ంజూతురో యనుచు నిన్నింతైన~ం జింతింప~ండా
జీవచ్ఛ్రాధ్ధము~ం జేసికొన్న యతియున్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 34 ॥
దినముం జిత్తములో సువర్ణముఖరీ తీరప్రదేశామ్రకా
ననమధ్యోపల వేదికాగ్రమున నానందంబునం బంకజా
నననిష్థ న్నును~ం జూడ~ం గన్ననదివో సౌఖ్యంబు లక్ష్మీవిలా
సినిమాయానటనల్ సుఖంబు లగునే శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 35 ॥
ఆలంచు న్మెడ~ం గట్టి దానికి నవత్యశ్రేణి~ం గల్పించి త
ద్భాలవ్రాతము నిచ్చిపుచ్చుటను సంబంధంబు గావించి యా
మాలర్మంబున బాంధవం బనెడి ప్రేమం గొందఱం ద్రిప్ప~ంగా~ం
సీలన్సీల యమర్చిన ట్లొస~ంగితో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 36 ॥
తనువే నిత్యముగా నొనర్చు మదిలేదా చచ్చి జన్మింపకుం
డ నుపాయంబు ఘటింపు మాగతుల రెంట న్నేర్పు లేకున్న లే
దని నాకిప్పుడ చెప్పు చేయ~ంగల కార్యంబున్న సంసేవ~ం జే
సి నినుం గాంచెద~ంగాక కాలముననో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 37 ॥
పదునాల్గేలె మహాయుగంబు లొక భూపాలుండు; చెల్లించె న
య్యుదయాస్తాచలసంధి నాజ్ఞ నొక~ం డాయుష్మంతుండై వీరియ
భ్యుదయం బెవ్వరు చెప్ప~ంగా వినరొ యల్పుల్మత్తులై యేల చ
చ్చెదరో రాజుల మంచు నక్కటకటా! శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 38 ॥
రాజన్నంతనె పోవునా కృపయు ధర్మంబాభిజాత్యంబు వి
ద్యాజాతక్షమ సత్యభాషణము విద్వన్మిత్రసంరక్షయున్
సౌగన్యంబు కృతంబెఱుంగటయు విశ్వాసంబు గాకున్న దు
ర్బీజశ్రేష్థులు గా~ం గతంబు గలదే శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 39 ॥
మును నీచే నపవర్గరాజ్యపదవీ మూర్ధాభిషేకంబు గాం
చిన పుణ్యాత్ములు నేను నొక్కసరివో చింతించి చూడంగ నె
ట్లనినం గీటఫణీంద్రపోతమదవే దండోగ్రహింసావిచా
రిని గాంగా~ం నిను గాన~ంగాక మదిలో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 40 ॥
పవమానాశనభూషణప్రకరమున్ భద్రేభచర్మంబు నా-
టవికత్వంబు~ం ప్రియంబులై భుగహశుండాలాతవీచారులన్
భవదుఃఖంబుల~ం బాపు టొప్పు~ం జెల~ందింబాటించి కైవల్యమి-
చ్చి వినోదించుట కేమి కారణమయా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 41 ॥
అమరస్త్రీల రమించినం జెడదు మోహం బింతయున్ బ్రహ్మప-
ట్టము సిధ్ధించిన నాస దీఱదు నిరూఢక్రోధమున్ సర్వలో-
కముల న్మ్రింగిన మాన దిందు~ం గల సౌ-ఖ్యం బొల్ల నీసేవ~ం జే-
సి మహాపాతకవారిరాశి~ం గడతున్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 42 ॥
చనువారిం గని యేద్చువారు జము~ండా సత్యంబుగా వత్తు మే
మనుమానంబి~ంక లేదు నమ్మమని తారావేళ నారేవునన్
మును~ంగంబోవుచు బాస సేయుట సుమీ ముమ్మాటికిం జూడగా~ం
జెనటు ల్గానరు దీనిభావమిదివో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 43 ॥
భవదుఃఖంబులు రాజకీటముల నేబ్రార్ధించినం బాయునే
భవదంఘ్రిస్తుతిచేత~ంగాక విలసద్బాలక్షుధాక్లేశదు
ష్టవిధుల్మానునె చూడ మే~ంకమెడచంటందల్లి కారుణ్యద్బ
ష్థివిశేషంబున నిచ్చి చంట~ంబలె నో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 44 ॥
పవి పుష్పంబగు నగ్ని మంచగు నకూపారంబు భూమీస్థలం
బవు శత్రుం డతిమిత్రు~ండౌ విషము దివ్యాహారమౌ నెన్న~ంగా
నవనీమండలిలోపలన్ శివ శివే త్యాభాషణోల్లాసికిన్
శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 45 ॥
లేవో కానల~ం గంధమూలఫలముల్ లేవో గుహల్ తోయముల్
లేవో యేఱుల~ం బల్లవాస్తరణముల్ లేవో సదా యాత్మలో
లేవో నీవు విరక్తుల న్మనుప జాలిం బొంది భూపాలురన్
సేవల్ సేయ~ంగ~ం బోదు రేలొకొ జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 46 ॥
మును నే~ం బుట్టిన పుట్టు లెన్ని గలవో మోహంబుచే నందు~ంజే
సిన కర్మంబుల ప్రోవు లెన్ని గలవో చింతించినన్ గాన నీ
జననంబే యని యున్న వాడ నిదియే చాలింపవే నిన్ను~ం గొ
ల్చిన పుణ్యంబునకుం గృపారతు~ండవై శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 47 ॥
తను వెందాక ధరిత్రి నుండు నను నందాకన్ మహారోగదీ
పనదుఃఖాదుల~ం బొందకుండ ననుకంపాదృష్టి వీక్షించి యా
వెనుకన్ నీపదపద్మముల్ దల~ంచుచున్ విశ్వప్రపంచంబు~ం బా
సిన చిత్తంబున నుండ~ంజేయంగదవే శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 48 ॥
మలభూయిష్ట మనోజధామము సుషుమ్నాద్వారమో యారు కుం
డలియో పాదకరాక్షియుగ్మంబులు షట్కంజంబులో మోము దా
జలజంబో నిటలంబు చంద్రకళయో సంగంబు యోగంబొ గా
సిలి సేవింతురు కాంతలన్ భువి జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 49 ॥
జలకంబుల్ రసముల్ ప్రసూనములు వాచాబంధముల్ వాద్యము
ల్కలశబ్ధధ్వను లంచితాంబర మలంకారంబు దీప్తు ల్మెఱుం
గులు నైవేద్యము మాధురీ మహిమగా~ం గొల్తున్నినున్ భక్తిరం
జిల దివ్యార్చన గూర్చి నేర్చిన క్రియన్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 50 ॥
ఏలీల న్నుతియింపవచ్చు నుపమోత్ప్రేక్షాధ్వనివ్యంగ్యశ
బ్ధాలంకారవిశేషభాషల కలభ్యంబైన నీరూపముం
జాలు~ంజాలు~ం గవిత్వముల్నిలుచునే సత్యంబు వర్ణించుచో
చీ! లజ్జింపరుగాక మాదృశకవుల్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 51 ॥
పాలుం బువ్వయు~ం బెట్టెదం గుడువరా పాపన్న రా యన్న లే
లేలెమ్మన్న నరంటిపండ్లు~ం గొని తేలేకున్న నేనొల్లనం
టే లాలింపరే తల్లిదండ్రులపు డట్లే తెచ్చి వాత్సల్య ల
క్ష్మీలీలావచనంబులం గుడుపరా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 52 ॥
కలలంచున్ శకునంబులంచు గ్రహయోగం బంచు సాముద్రికం
బు లటంచుం దెవులంచు దిష్ట్మనుచున్ భూతంబులంచు న్విషా
దులటంచు న్నిమిషార్ధ జీవనములంచుం బ్రీతి~ం బుట్టించి యీ
సిలుగుల్ ప్రాణులకెన్ని చేసితివయా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 53 ॥
తలమీ~ందం గుసుమప్రసాద మలికస్థానంబుపై భూతియున్
గళసీమంబున దండ నాసికతుదన్ గంధప్రసారంబు లో
పల నైవేద్యము~ం జేర్చు నే మనుజ్~ం డాభక్తుండు నీకెప్పుడుం
జెలికాడై విహరించు రౌప్యగిరిపై శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 54 ॥
ఆలుం బిడ్డలు మిత్రులున్ హితులు నిష్టర్ధంబు లీనేర్తురే
వేళ న్వారి భజింప~ం జాలిపడ కావిర్భూత మోదంబునం
గాలంబెల్ల సుఖంబు నీకు ని~ంక భక్తశ్రేణి రక్షింపకే
శ్రీలెవ్వారికి~ం గూడంబెట్టెదవయా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 55 ॥
సులభుల్మూర్ఖు లనుత్తమోత్తముల రాజుల్గల్గియేవేళ న
న్నలంతలబెట్టిన నీ పదాబ్ధముల~ం బాయంజాల నేమిచ్చినం
గలధౌతాచల మేలు టంబునిధిలో~ం గాపుండు టబ్జంబు పై~ం
జెలువొప్పున్ సుఖియింప~ం గాంచుట సుమీ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 56 ॥
కలధౌతాద్రియు నస్థిమాలికయు గోగంధర్వమున్ బున్కయుం
బులితోలు న్భసితంబు~ం బా~ంపతొదవుల్ పోకుండ~ం దో~ంబుట్లకై
తొలి నేవారలతోడ~ం బుట్టక కళాదుల్గల్గె మేలయ్యెనా
సిలువుళూరముచేసికొం టెఱింగియే శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 57 ॥
శ్రుతులభ్యాసముచేసి శాస్త్రగరిమల్ శోధించి తత్త్వంబులన్
మతి నూహించి శరీర మస్థిరము బ్రహ్మంబెన్న సత్యంబు గాం
చితి మంచున్ సభలన్ వృధావచనము ల్చెప్పంగనే కాని ని
ర్జితచిత్తస్థిర సౌఖ్యముల్ దెలియరో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 58 ॥
గతి నీవంచు భజించువార లపవర్గం బొందగానేల సం
తతముం గూటికినై చరింప వినలేదా యాయు రన్నం ప్రయ
చ్ఛతి యంచున్మొఱవెట్టగా శ్రుతులు సంసారాంధకారాభి దూ
షితదుర్మార్గుల్ గాన~ం గానంబడవో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 59 ॥
రతిరా జుద్ధతి మీఱ నొక్కపరి గోరాజాశ్వుని న్నొత్త~ం బో
నత~ం డాదర్పకు వేగ నొత్త గవయం బాంబోతునుం దా~ంకి యు
గ్రత~ం బోరాడంగనున్న యున్నడిమి లే~ంగల్వోలె శోకానల
స్థితిపాలై మొఱపెట్టునన్ మనుపవే శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 60 ॥
అంతా సంశయమే శరీరఘటనంబంతా విచారంబె లో
నంతా దుఃఖపరంపరానివితమె మేనంతా భయభ్రాంతమే
యంతానంతశరీరశోషణమె దుర్వ్యాపారమే దేహికిన్
జింతన్ నిన్ను~ం దలంచి పొందరు నరుల్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 61 ॥
సంతోషించితిని~ం జాలుంజాలు రతిరాజద్వారసౌఖ్యంబులన్
శాంతిన్ బొందితి~ం జాలు~ంజాలు బహురాజద్వారసౌఖ్యంబులన్
శాంతిం బొందెద~ం జూపు బ్రహ్మపదరాజద్వారసౌఖ్యంబు ని
శ్చింతన్ శాంతు~ండ నౌదు నీ కరుణచే శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 62 ॥
స్తోత్రం బన్యుల~ం జేయనొల్లని వ్రతస్థుల్వోలె వేసంబుతో~ం
బుత్రీ పుత్ర కలత్ర రక్షణ కళాబుధ్ధిన్ నృపాలా(అ)ధమన్
బాత్రం బంచు భజింప~ంబోదు రితియున్ భాష్యంబె యివ్వారిచా
రిత్రం బెన్న~ండు మెచ్చ నెంచ మదిలో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 63 ॥
అకలంకస్థితి నిల్పి నాడ మను ఘంటా(ఆ)రావమున్ బిందుదీ
పకళాశ్రేణి వివేకసాధనములొప్పన్ బూని యానందతా
రకదుర్గాటవిలో మనోమృగముగర్వస్ఫూర్తి వారించువా
రికి~ంగా వీడు భవోగ్రబంధలతికల్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 64 ॥
ఒకయర్ధంబు నిన్ను నే నడుగ~ంగా నూహించి నెట్లైన~ం బొ
మ్ము కవిత్వంబులు నాకు~ం జెందనివి యేమో యంటివా నాదుజి
హ్వకు నైసర్గిక కృత్య మింతియ సుమీ ప్రార్ధించుటే కాదు కో
రికల న్నిన్నునుగాన నాకు వశమా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 65 ॥
శుకముల్ కింశుకపుష్పముల్ గని ఫలస్తోమం బటంచున్సము
త్సుకతం దేర~ంగ~ం బోవు నచ్చట మహా దుఃఖంబు సిద్ధించు~ం; గ
ర్మకళాభాషలకెల్ల~ం బ్రాపులగు శాస్త్రంబు ల్విలోకించువా
రికి నిత్యత్వమనీష దూరమగు~ంజూ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 66 ॥
ఒకరిం జంపి పదస్థులై బ్రతుక~ం దామొక్కొక్క రూహింతురే
లొకొ తామెన్న~ండు~ం జావరో తమకు~ం బోవో సంపదల్ పుత్రమి
త్రకళత్రాదులతోడ నిత్య సుఖమందం గందురో యున్నవా
రికి లేదో మృతి యెన్న~ండుం గటకట శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 67 ॥
నీ కారుణ్యము~ం గల్గినట్టి నరు~ం డేనీచాలయంబుల జొరం
డేకార్పణ్యపు మాటలాడ నరుగం డెవ్వారితో వేషముల్
గైకోడే మతముల్ భజింప~ం డిలనేకష్టప్రకారంబులన్
జీకాకై చెడిపో~ందు జీవనదశన్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 68 ॥
జ్ఞాతుల్ ద్రోహంబు వాండ్రు సేయుకపటేర్యాది క్రియాదోషముల్
మాతండ్రాన సహింపరాదు ప్రతికర్మంబించుకే జేయగా~ం
బోతే దోసము గాన మాని యతినై పో~ంగోరినన్ సర్వదా
చేతఃక్రోధము మాన దెట్లు నడుతున్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 69 ॥
చదువుల్ నేర్చిన పండితాధములు స్వేచ్ఛాభాషణక్రీడలన్
వదరన్ సంశయభీకరాటవులం ద్రోవళప్పి వర్తింప~ంగా
మదనక్రోధకిరాతులందు~ం గని భీమప్రౌఢిచే~ం దా~ంకినం
జెదరుం జిత్తము చిత్తగింప~ంగదవే శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 70 ॥
రోసిం దేంటిది రో~ంత దేంటిది మనొ రోగస్థుండై దేహి తా~ం
బూసిందేంటిది పూ~ంత లేంటివి మదా(అ)పూతంబు లీ దేహముల్
మూసిందేంటిది మూ~ంతలేంటివి సదామూఢత్వమే కాని తా~ం
జేసిందేంటిది చేంతలే~ంటివి వృధా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 71 ॥
శ్రీ శైలేశు భజింతునో యభవుంగాంచీ నాధు సేవింతునో
కాశీవల్లభు~ం గొల్వంబోదునొ మహా కాళేశు~ం బూజింతునో
నాశీలం బణువైన మేరు వనుచున్ రక్షింపవే నీ కృపా
శ్రీ శృంగారవిలాసహాసములచే శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 72 ॥
అయవారై చరియింపవచ్చు~ం దన పాదాం(అ)భోజతీర్ధంబులన్
దయతో~ం గొమ్మనవచ్చు సేవకుని యర్ధప్రాణదేహాదుల
న్నియు నా సొమ్మనవచ్చు~ంగాని సిరులన్నిందించి నిన్నాత్మని
ష్క్రియతం గాన~ంగరాదు పండితులకున్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 73 ॥
మాయా(అ) జాండకరండకోటి~ం బొడిగామర్ధించిరో విక్రమా(అ)
జేయుం గాయజు~ం జంపిరో కపటలక్ష్మీ మోహముం బాసిరో
యాయుర్దయభుజంగమృత్యువు ననాయాసంబునన్ గెల్చిరో
శ్రేయోదాయక్ లౌదు రెట్టు లితరుల్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 74 ॥
చవిగా~ం జూడ వినంగ మూర్కొన~ం దనూసంఘర్షణాస్వాదమొం
ద వినిర్మించెద వేల జంతువుల నేతత్క్రీడలే పాతక
వ్యవహారంబలు సేయునేమిటికి మాయావిద్యచే బ్రొద్దుపు
చ్చి వినోదింప~ంగ దీన నేమి ఫలమో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 75 ॥
వెనుకం జేసిన ఘోరదుర్దశలు భావింపంగ రో~ంతయ్యెడున్
వెనుకన్ ముందట వచ్చు దుర్మరణముల్ వీక్షింప భీతయ్యెడున్
నను నే~ంజూడగ నావిధుళలంచియున్ నాకే భయం బయ్యెడుం
జెనకుంజీ~ంకటియాయె~ం గాలమునకున్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 76 ॥
పరిశీలించితి మంత్రతంత్రములు చెప్ప న్వింటి సాంఖ్యాదియో
గ రహస్యంబులు వేద శాస్త్రములు వక్కాణించితిన్ శంకవో
దరయం గుమ్మడికాయలోని యవగింజంతైన నమ్మిచంచి సు
స్థిరవిజ్ఞానము త్రోవ~ం జెప్ప~ంగదవే శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 77 ॥
మొదలం జేసినవారి ధర్మములు నిర్మూలంబుగా~ం జేసి దు
ర్మదులై యిప్పుడు వారె ధర్మము లొనర్పం దమ్ము దైవంబు న
వ్వడె రానున్న దురాత్ములెల్ల దమత్రోవం బోవరే ఏల చే
సెదరో మీ~ందు దలంచిచూడ కధముల్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 78 ॥
కాసంతైన సుఖం బొనర్చునొ మనఃకామంబు లీడేర్చునో
వీసంబైనను వెంటవచ్చునొ జగద్విఖ్యాతి~ం గావించునో
దోసంబు ల్బెడ~ం బొపునో వలసినందోడ్తో మిముం జూపునో
ఛీ! సంసారదురాశ యేలుదుపవో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 79 ॥
ఒకపూ~ంటించుక కూడ తక్కువగునే నోర్వంగలే~ం డెండకో
పక నీడన్వెదకుం జలిం జడిచి కుంపట్లెత్తుకో~ంజూచు వా
నకు నిండిండ్లును దూఱు నీతనువు దీనన్వచ్చు సౌఖ్యంబు రో
సి కడాసింపరుగాక మర్త్వులకట శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 80 ॥
కేదారాదిసమస్తతీర్ధములు కోర్మింజూడ~ం బోనే~ంటికిన్
గాడా ముంగిలి వారణాసి! కడుపే కైలాసశైలంబు మీ
పాదధ్యానము సంభవించునపుడే భావింప నజ్ఞానల
క్ష్మీదారిద్ర్యులు గారె లోకు లకటా! శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 81 ॥
తమకొం బొప్ప~ం బరాంగనాజనపర ద్రవ్యంబులన్ మ్రుచ్చిలం
గ మహోద్యోగము సేయనెమ్మనముదొంగం బట్టి వైరాగ్యపా
శములం జుట్టి బిగిమంచి నీదుచరణ స్తంభంజునం గట్టివై
చి ముదం బెప్పుడు~ం గల్గ~ంజేయ గడవే శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 82 ॥
వేధం దిట్టగరాదుగాని భువిలో విద్వాంసులంజేయ నే
లా ధీచాతురి~ం జేసె~ం జేసిన గులామాపాటనే పోక క్షు
ద్బాధాదుల్ గలిగింపనేల యది కృత్యంబైన దుర్మార్గులం
జీ! ధాత్రీశుల~ం జేయనే~ంటి కకటా! శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 83 ॥
పుడమి న్నిన్నొక బిల్వపత్రముననే~ం బూజించి పుణ్యంబునుం
బడయన్నేరక పెక్కుదైవములకుం బప్పుల్ ప్రసాదంబులం
గుడుముల్ దోసెలు సారెసత్తులడుకుల్ గుగ్గిళ్ళునుం బేట్టుచుం
జెడి యెందుం గొఱగాకపోదు రకటా! శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 84 ॥
విత్తజ్ఞానము పాదు చిత్తము భవావేశంబు రక్షాంబువుల్
మత్తత్వంబు తదంకురం ఐనృతముల్ మాఱాకు లత్యంతదు
ద్వృత్తుల్ పువ్వులు~ం బండ్లు మన్మధముఖా విర్భూతదోషంబులుం
జిత్తాధ్యున్నతనింబభూజమునకున్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 85 ॥
నీపై~ం గాప్యము చెప్పుచున్న యత~ండున్నీపద్యముల్ వ్రాసియి
మ్మా పాఠంమొనరింతునన్న యత~ండున్ మంజుప్రబంధంబు ని
ష్టాపూర్తిం బఠియించుచున్న యత~ండున్ సద్బాంధవుల్ గాక చీ
చీ! పృష్ఠాగతబాంధవంబు నిజమా! శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 86 ॥
సంపద్గర్వము~ం బాఱ~ంద్రోలి రిపులన్ జంకించి యాకాంక్షలన్
దంపుల్వెట్టి కళంకము ల్నఱకి బంధక్లేశదోషంబులం
జింపుల్సేసి వయోవిలాసములు సంక్షేపించి భూతంబులం
జెంపల్వేయక నిన్ను~ం గాననగునా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 87 ॥
రాజశ్రేణికి దాసులై సిరుల~ం గోరం జేరంగా సౌఖ్యమో
యీ జన్మంబు తరింప~ంజేయగల మిమ్మే ప్రొద్దు సేవించు ని
ర్వ్యాజాచారము సౌఖ్యమో తెలియలేరౌ మానవు ల్పాపరా
జీజాతాతిమదాంధబుద్ధు లగుచున్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 88 ॥
నిన్నం జూడరొ మొన్న~ం జూడరో జనుల్ నిత్యంబు జావంగ నా
పన్ను ల్గన్ననిధాన మయ్యెడి ధనభ్రాంతిన్ విసర్జింపలే
కున్నా రెన్న~ండు నిన్ను గండు రిక మర్త్వుల్ గొల్వరేమో నినున్
విన్నం బోవక యన్యదైవరతులన్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 89 ॥
నన్నే యెను~ంగుతోలుదుప్పటము బువ్వాకాలకూతంబు చే
గిన్నే బ్రహ్మకపాల ముగ్రమగు భోగే కంఠహారంబు మేల్
నిన్నీలాగున నుంటయుం దెలిసియున్ నీపాదపద్మంబు చే
ర్చెన్ నారయణు~ం డెట్లు మానసము~ం దా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 90 ॥
ద్వారద్వారములందు~ం జంచుకిజనవ్రాతంబు దండంములన్
దోరంత్స్థలి బగ్గనం బొడుచుచున్ దుర్భాషలాడ న్మఱిన్
వారిం బ్రార్ధనచేసి రాజులకు సేవల్సేయ~ంగా~ంబోరుల
క్ష్మీరాజ్యంబును గోరి నీమరిజనుల్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 91 ॥
ఊరూరం జనులెల్ల బిక్ష మిదరోయుందం గుహల్గల్గవో
చీరానీకము వీధులం దొరుకరో శీతామృతస్వచ్ఛవాః
పూరం బేరుల~ం బాఱదో తపసులంబ్రోవంగ నీవోపవో
చేరం బోవుదురేల రాగుల జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 92 ॥
దయ జూడుండని గొందఱాడుదురు నిత్యంబున్ నినుం గొల్చుచున్
నియమం బెంతో ఫలంబు నంతియెకదా నీవీయ పిండెంతో అం
తియకా నిప్పటియుం దలంపనను బుద్ధిం జూడ; నేలబ్బుని
ష్క్రియతన్ నిన్ను భజింప కిష్టసుఖముల్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 93 ॥
ఆరావం బుదయించె~ం దారకముగ నాత్మాభ్రవీధిన్మహా(అ)
కారోకారమకారయుక్తమగు నోంకారాభిధానంబు చె
న్నారున్ విశ్వ మనంగ~ం దన్మహిమచే నానాదబిందుల్ సుఖ
శ్రీ రంజిల్ల~ం గడంగు నీవదె సుమీ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 94 ॥
నీభక్తు ల్మదివేల భంగుల నినున్సేవింబుచున్ వేడ~ంగా
లోభంబేటికి వారి కోర్కులు కృపళుత్వంబునం దీర్మరా
దా భవ్యంబు~ం దలంచి చూడు పరమార్ధం బిచ్చి పొమ్మన్న నీ
శ్రీ భాండరములో~ం గొఱంతపడునా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 95 ॥
మొదలన్భక్తులకిచ్చినా~ండవుగదా మోక్షంబు నే~ం డేమయా
ముదియంగా ముదియంగ~ం బుట్టు ఘనమౌ మోహంబు లోభంబు న
న్నది సత్యంబు కృపం దలంప నొకవుణ్యాత్ముండు నిన్నాత్మ గొ
ల్చి దినంబున్ మొఱవెట్ట~ంగా~ం గటగటా! శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 96 ॥
కాలద్వారకవాటబంధనము దుష్కాల్ప్రమాణక్రియా
లోలాజాలకచిత్రగుప్తముఖవ ల్మీకోగ్రజిహ్వాద్భుత
వ్యళవ్యాళవిరోధి మృత్యుముఖదంష్ట్రా(అ)హార్య వజ్రంబు ది
క్చేలాలంకృత! నీదునామ మరయన్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 97 ॥
పదివేలలైనను లోకకంటకులచే~ం బ్రాప్రించు సౌఖ్యంబు నా
మదికిం బథ్యము గాదు సర్వమునకున్ మధ్యస్థు~ండై సత్యదా
నదయాదుల్ గల రాజు నాకొస~ంగు మేనవ్వాని నీ యట్లచూ
చి దినంబున్ ముదమొందుదున్ గడపటన్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 98 ॥
తాతల్ తల్లియు~ం దండ్రియున్ మఱియు~ం బెద్దల్ చావగా~ం జూడరో
భీతిం బొంద~ంగనేల చావునకు~ంగా~ం బెండ్లాముబిడ్డల్ హిత
వ్రాతంబున్ బలవింప జంతువులకున్ వాలాయమైయుండంగా~ం
జేతోవీధి నరుండు నిన్గొలువ~ండో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 99 ॥
జాతుల్ సెప్పుట సేవసేయుట మృషల్ సంధించు టన్యాయవి
ఖ్యాతిం బొందుట కొండెకా~ండవుట హింసారంభకుండౌట మి
ధ్యాతాత్పర్యములాడుటన్నియు~ం బరద్రవ్యంబునాశించి యీ
శ్రీ తా నెన్నియుగంబు లుండ~ంగలదో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 100 ॥
చెడుగుల్ కొందఱు కూడి చేయంగంబనుల్ చీకట్లు దూఱంగ~ం మా
ల్పడితిం గాన గ్రహింపరాని నిను నొల్లంజాల~ం బొమ్మంచు నిల్
వెలంద్రోచిన~ం జూరుపట్టుకొని నే వ్రేలాడుదుం గోర్కి~ం గో
రెడి యర్ధంబులు నాకు నేల యిడవో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 101 ॥
భసితోద్ధూళనధూసరాంగులు జటాభారోత్తమాంగుల్ తపో
వ్యసనముల్ సాధితపంచవర్ణరసముల్ వైరాగ్యవంతుల్ నితాం
తసుఖస్వాంతులు సత్యభాషణలు నుద్యద్రత్నరుద్రాక్షరా
జిసమేతుల్ తుదనెవ్వరైన గొలుతున్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 102 ॥
జలజశ్రీ గల మంచినీళ్ళు గలవాచత్రాతిలో బాపురే!
వెలివాడ న్మఱి బా~ంపనిల్లుగలదావేసాలుగా నక్కటా!
నలి నా రెండు గుణంబు లెంచి మదిలో నన్నేమి రోయంగ నీ
చెలువంబైన గుణంబు లెంచుకొనవే శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 103 ॥
గడియల్ రెంటికొ మూ~ంటికో గడియకో కాదేని నే~ండెల్లియో
కడ నే~ండాదికొ యెన్న~ండో యెఱు~ం గ మీకాయంబు లీభూమిపై~ం
బడగా నున్నవి ధర్మమార్గమొకటిం బాటింప రీ మానవుల్
చెడుగుల్ నీపదభక్తియుం దెలియరో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 104 ॥
క్షితిలో దొడ్డతురంగసామజము లేచిత్రమ్ము లాందోళికా
తతు లే లెక్క విలాసినీజనసువస్రవ్రాత భూషాకలా
పతనూజాదిక మేమిదుర్లభము నీ పాదమ్ము లర్చించుచో
జితపంకేరుహపాదపద్మయుగళా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 105 ॥
సలిలమ్ముల్ జుఖుకప్రమాణ మొక పుష్మమ్మున్ భవన్మౌళి ని
శ్చలబక్తిప్రపత్తిచే నరు~ండు పూజల్ సేయ~ంగా ధన్యు~ండౌ
నిల గంగాజలచంద్రఖండముల దానిందుం దుదిం గాంచు నీ
చెలువం బంతయు నీ మహత్త్వ మిదిగా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 106 ॥
తమనేత్రద్యుతి~ం దామె చూడ సుఖమైతాదాత్మ్యమున్ గూర్ప~ంగా
విమలమ్ముల్ కమలాభముల్ జితలసద్విద్యుల్లతాలాస్యముల్
సుమనోబాణజయప్రదమ్ములనుచున్ జూచున్ జనంబూనిహా
రిమృగాక్షీనివహమ్ముకన్నుగవలన్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 107 ॥
పటవద్రజ్జుభుజంగవద్రజతవి భ్రాంతిస్ఫురచ్ఛుక్తివ
ద్ఘటవచ్చంద్రశిలాజపాకుసుమరు క్సాంగత్యవత్తంచువా
క్పటిమల్ నేర్తురు చిత్సుఖం బనుభవింపన్ లేక దుర్మేధనుల్
చిటుకన్నం దలపోయ~ంజూతు రధముల్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 108 ॥
నిను నిందించిన దక్షుపై~ం దెగవొ వాణీనాధు శాసింపవో
చనునా నీ పాదపద్మసేవకుల~ం దుచ్ఛం బాడు దుర్మార్గులం
బెనుపన్ నీకును నీదుభక్తతతికిన్ భేదంబు గానంగ వ
చ్చెనొ లేకుండిన నూఱకుండగలవా శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 109 ॥
కరిదైత్యున్ బొరిగొన్న శూలము క(రా)రగ్ర(స్థ)స్తంబు గాదో రతీ
శ్వరునిన్ గాల్చిన ఫాలలోచనశిఖా వర్గంబు చల్లాఱెనో
పరనిందాపరులన్ వధింప విదియున్ భాష్యంబె వారేమి చే
సిరి నీకున్ బరమోపకార మరయన్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 110 ॥
దురమున్ దుర్గము రాయబారము మఱిన్ దొంగర్మమున్ వైద్యమున్
నరనాధాశ్రయ మోడబేరమును బెన్మంత్రంబు సిద్ధించినన్
అరయన్ దొడ్డఫలంబు గల్గునదిగా కాకార్యమే తప్పినన్
సిరియుం బోవును బ్రాణహానియు నగున్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 111 ॥
తనయుం గాంచి ధనంబు నించి దివిజస్థానంబు గట్టించి వి
ప్రున కుద్వాహము జేసి సత్కృతికి~ం బాత్రుండై తటాకంబు నే
ర్పున~ం ద్రవ్వించి వనంబు వెట్టి మననీ పోలేడు నీసేవ~ం జే
సిన పుణ్యాత్ము~ండు పోవు లోకమునకున్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 112 ॥
క్షితినాధోత్తమ! సత్కవీశ్వరు~ండ్ వచ్చెన్ మిమ్ములం జూడ~ంగా
నత~ండే మేటి కవిత్వవైఖరిని సద్యఃకావ్యనిర్మాత తత్
ప్రతిభ ల్మంచిని తిట్టుపద్యములు చెప్పుం దాత~ండైనన్ మముం
గ్రితమే చూచెను బొమ్మటంచు రధముల్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 113 ॥
నీకుం గాని కవిత్వ మెవ్వరికి నేనీనంచు మీదెత్తితిన్
జేకొంటిన్ బిరుదంబు కంకణము ముంజే~ం గట్టితిం బట్టితిన్
లోకుల్ మెచ్చ వ్రతంబు నాతనువు కీలుల్ నేర్పులుం గావు ఛీ
ఛీ కాలంబులరీతి దప్పెడు జుమీ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 114 ॥
నిచ్చల్ నిన్ను భజించి చిన్మయమహా నిర్వాణపీఠంబు పై
రచ్చల్సేయక యార్జవంబు కుజన వ్రాతంబుచే~ం గ్రాంగి భూ
భృచ్చండాలుర~ం గొల్చి వారు దను~ం గోపింమన్ బుధుం డార్తు~ండై
చిచ్చారం జము రెల్ల~ం జల్లుకొనునో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 115 ॥
దంతంబు ల్పడనప్పుడే తనువునందారూఢి యున్నప్పుడే
కాంతాసంఘము రోయనప్పుడే జరక్రాంతంబు గానప్పుడే
వితల్మేన జరించనప్పుడె కురుల్వెల్లెల్ల గానప్పుడే
చింతింపన్వలె నీపదాంబుజములన్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 116 ॥


🙏 Sree Kaala Hastiswara Satakam Telugu Srividyutkalitajavanjavamaha Jimutapapambudha Lyrics in Telugu PDF, MP3 Download శ్రీవిద్యుత్కలితాఽజవంజవమహా జీమూతపాపాంబుధా శ్రీ కాళ హస్తీశ్వర శతకం Lyrics in Telugu | www.chalisa.online.You will also find Bhagwan Mahadev Mantra Chanting MP3 free download, Bhagwan Mahadev Mantra Chanting MP3 Ringtone download,Bhagwan Mahadev photos and, Bhagwan Mahadev Wallpapers, Bhagwan Mahadev Whatsapp status. 🙏


Search


    🙏 Your Most recent visits on Chalisa.online

    Like the page... Share on Facebook

    🙏 More Lyrics for Hindu God Bhagwan Mahadev







    You may like this as well...




    Sree Kaala Hastiswara Satakam Telugu Srividyutkalitajavanjavamaha Jimutapapambudha Lyrics in Telugu Image

    srividyutkalitajavanjavamaha-jimutapapambudha--sree-kaala-hastiswara-satakam-telugu-telugu-lyrics-download




    🌻 Sree Kaala Hastiswara Satakam Telugu Srividyutkalitajavanjavamaha Jimutapapambudha Lyrics in Telugu PDF Download

    View the pdf for the Sree Kaala Hastiswara Satakam Telugu Srividyutkalitajavanjavamaha Jimutapapambudha | శ్రీవిద్యుత్కలితాఽజవంజవమహా జీమూతపాపాంబుధా | శ్రీ కాళ హస్తీశ్వర శతకం using the link given below.


    👉 Click to View the PDF file for Srividyutkalitajavanjavamaha Jimutapapambudha Lyrics in Telugu Here...


    Few More Pages Related to Bhagwan Mahadev





    🙏 Benefits of Chanting Sree Kaala Hastiswara Satakam Telugu Srividyutkalitajavanjavamaha Jimutapapambudha


    As per Hindu mythology, there are many Benefits (fayade) ofSree Kaala Hastiswara Satakam Telugu Srividyutkalitajavanjavamaha Jimutapapambudha chantings regularly.
    You will get many blessing of Aliasenamehere and get ample peace of mind.

    It will be better to understand the Sree Kaala Hastiswara Satakam Telugu Srividyutkalitajavanjavamaha Jimutapapambudhameaning in Telugu or In your native language to maximizeits Benefits.
    You can chant Sree Kaala Hastiswara Satakam Telugu Srividyutkalitajavanjavamaha Jimutapapambudha inDevanagari / Hindi / English / Bengali / Marathi / Telugu / Tamil / Gujarati / Kannada / Odia / Malayalamor Sanskrit language i.e. the language you like or you speak.

    🙏 Sree Kaala Hastiswara Satakam Telugu Srividyutkalitajavanjavamaha Jimutapapambudha Paths or Jaaps (recites)


    For regular worship single recital i.e. Ek paths of Sree Kaala Hastiswara Satakam Telugu Srividyutkalitajavanjavamaha Jimutapapambudha is also sufficient.
    You can recite Mantra or Stotra of Bhagwan Mahadev for108 times in a single go i.e. 108 bar paths of thesame, but it has to be with complete devotion and without haste.

    🙏 How to do Paths (recites) of Sree Kaala Hastiswara Satakam Telugu Srividyutkalitajavanjavamaha Jimutapapambudha or How to chant Sree Kaala Hastiswara Satakam Telugu Srividyutkalitajavanjavamaha Jimutapapambudha?


    As per Hindu mythology, The good time to chant Sree Kaala Hastiswara Satakam Telugu Srividyutkalitajavanjavamaha Jimutapapambudha is early in the morning on brahma muhurta and after taking bath.

    I.e. While performing puja of Bhagwan Mahadev,you can enlighten diyas (Better to enlight mustard oil Diya as there are many benefits of(Sarso tel) mustard oil) and enlighten essence stick (agarbatti) or the Gomay dhoop.You can also enligth camphor as there are many benefits of camphor as well.if possible use bhimseni kapoor (bhimseni camphor) as it has more benefits that ordinary camphor.You can use fulmala and flowers to perform puja. You can check here how to perform daily Puja of Hindu god and goddess.

    You can also chant Sree Kaala Hastiswara Satakam Telugu Srividyutkalitajavanjavamaha Jimutapapambudha in the evening which will help to Finish Your Day with a Peaceful Mind.

    Chanting Sree Kaala Hastiswara Satakam Telugu Srividyutkalitajavanjavamaha Jimutapapambudha with complete devotion and without haste will help you to make you calm and increase concentration.






    Bhagwan-mahadev-God-images

    🙏 Hindu God Bhagwan Mahadev 🙏


    Om Tryambakam Yajamahe Sugandhim Pushti Vardhanam | Urvarukamiva Bandhanath Mrityormukshiya Mamritat || 🙏

    Om Namah Shivaya

    Lord Shivaji is originally from Mount Kailas and Goddess Parvati (Adishakti) is his Ardhangini (Wife). While Shri Ganesh and Karthikeya are considered his sons.

    He is also known as Mahadev.

    Shiva's color is white like that of Kapoor, so he is also called 'Karpoorgaur'.

    Shiva is also known as Gangadhar, because the Ganges flows through Mahadeva's Jatas, and also Lord Shiva holds the moon on his forehead. Shiva is also called Nagendra as Lord Shiva holding Vasuki Nag aroundhis neck.

    There is a third eye on Shivji's forehead between the eyebrows and just above the eyebrow.

    Shiva's important twelve Jyotirlingas.

    Mahadev, the God of Devas, appeared to his devotees from time to time, those places known as the "Jyotirlinga".

    1 Shri Somnath, Sorati (Gujarat)
    2 Shri Mallikarjun, Shri Shailam (Andhra Pradesh)
    3 Shri Mahakaleshwar, Ujjain (Madhya Pradesh)
    4 Shri Omkareshwar, Shivpuri (Madhya Pradesh)
    5 Shri Vaidyanath, Parli (Maharashtra)
    6 Shri Aundha Nagnath, Hingoli / Parbhani (Maharashtra)
    7 Shri Kedarshwar, Kedarnath (Uttaranchal Pradesh)
    8 Shri Trimbakeshwar, Nashik (Maharashtra)
    9 Shri Rameswaram, Rameswaram / Setubandhan (Tamil Nadu)
    10 Shri Bhimashankar, Dakini / Pune (Maharashtra)
    11 Shri Vishweshwar, Varanasi (Uttar Pradesh)
    12 Shri Ghrushneshwar, Verul / Devasarovar (Maharashtra)


    You can read more about Hindu God Bhagwan Mahadev here on Wikipedia


    Bhagwan-mahadev-God-mp3-mantra-download

    🌻 Listen to Digital Audio of - Hindu God Bhagwan Mahadev Mantras Online only on www.chalisa.online





    You can also listen to the other mp3 files such as Stotra, Mantra, Chalisa, Aarti for Hindu God Bhagwan Mahadev only on www.chalisa.online

    Download the WhatsApp status for Hindu God Bhagwan Mahadev


    Bhagwan-mahadev-God-mp3-mantra-download

    🙏 View Desktop Wallpapers, Mobile Wallpapers, WhatsApp Status etc. for Hindu God Bhagwan Mahadev



    Download Mobile and Desktop Wallpapers for Hindu God Bhagwan Mahadev

    🌸 You can also download the Wall-papers for Desktop and Mobiles and also Whats-App status for many files such as Stotra, Mantra, Chalisa, Aarti for Hindu God Bhagwan Mahadev only on www.chalisa.online





    🙏 Watch the video for - Hindu God Bhagwan Mahadev Mantra Online on www.chalisa.online





    🙏 You can view the PDF, Images, Apps, Desktop Wall-papers, Mobile Wall-papers, WhatsApp Status etc. for Hindu God Bhagwan Mahadev here on the www.chalisa.online.

    🙏 🙏 🙏 Thanks for visiting the page about the information of - Sree Kaala Hastiswara Satakam Telugu Srividyutkalitajavanjavamaha Jimutapapambudha for Hindu God Bhagwan Mahadev on our website - www.chalisa.online


    Contact Us to post your ads


    Contact Us to post your ads

    Posting your ads is free






    ^